ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా ...

- June 26, 2016 , by Maagulf
ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా ...

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా 'బజరంగీ భాయీజాన్‌' అవార్డును సొంతం చేసుకోగా,'బాజీరావు మస్తానీ' చిత్రం పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా సంజయ్‌ లీలా బన్సాలీకి ఐఫా పురస్కారం లభించింది. బాలీవుడ్‌ నటుల నృత్యాలు, సింగర్స్‌ పాటలతో ఐఫా వేడుక ఉత్సాహంగా సాగింది. బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, అమీషా పటేల్‌ తదితరులు హాజరయ్యారు.* ఉత్తమ చిత్రం: బజరంగీ భాయిజాన్‌
* ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ 
* ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌సింగ్‌ (బాజీరావ్‌ మస్తానీ) 
* ఉత్తమ నటి: దీపికా పదుకొణె(పికు) 
* ఉత్తమ కథ: జుహి చతుర్వేది(పికు) 
* ప్లే బ్యాక్‌ సింగర్‌(ఫిమేల్‌): మొనాలీ ఠాకూర్‌ 
* ప్లే బ్యాక్‌ సింగర్‌ (మేల్‌): పపాన్‌ 
* ఉమెన్‌ ఆప్‌ దయ ఇయర్‌: ప్రియాంక చొప్రా 
* సినినామటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ 
* ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌(తల్వార్‌) 
* స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ప్రసాద్‌ సుతారా(బాజీరావ్‌ మస్తానీ)

 

 
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com