యూఏఈ నేషనల్ డే ఆఫర్‌.. ఉచితంగా 53GB డేటా..!!

- November 29, 2024 , by Maagulf
యూఏఈ నేషనల్ డే ఆఫర్‌.. ఉచితంగా 53GB డేటా..!!

యూఏఈ: 53వ యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా టెలికాం ఆపరేటర్ ‘డూ’ ఉచిత డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 4 వరకు అందుబాటులో ఉండే ప్రత్యేకమైన ఆఫర్‌లు, ప్రమోషన్‌లను ప్రకటించింది.

పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లందరికి ఏడు రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 53GB జాతీయ డేటాను ఉచితంగా అందించనున్నారు.ఈ ఆఫర్ డిసెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రీపెయిడ్ ఫ్లెక్సీ వార్షిక ప్లాన్‌లను కొనుగోలు చేసిన లేదా వాటికి మారిన కస్టమర్‌లు సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే 53GB జాతీయ డేటాను ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఉచిత డేటాను ఎలా పొందాలో తెలియజేస్తూ ప్రీపెయిడ్ వినియోగదారులు లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు ఇప్పటికే మెసేజులు పంపినట్టు టెలికాం ఆపరేటర్ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com