భార్యకు బంగారు గొలుసు కొంటే లక్కీగా 8 కోట్లు వరించిన అదృష్టం
- November 30, 2024
అదృష్టం అంటే ఇతడిదే.. ఎందుకంటే సింగపూర్‌లో ఒక ప్రవాస భారతీయుడు భార్య కోసం బంగారు గొలుసు కొంటే ఏకంగా లక్కీ డ్రాలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.ఇది కదా అదృష్టం అంటే.ఇంతకీ ఈ అదృష్టవంతుడు ఎవరో డీటెయిల్ గా తెలుసుకుందాం.
సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన బాలసుబ్రమణ్యం చిదంబరం అనే వ్యక్తి తన భార్య కోసం స్థానికంగా ఉన్న ముస్తఫా జ్యువెలరీ షాపులో మూడు నెలల క్రితం 6000 డాలర్ల విలువైన బంగారు గొలుసు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసే సమయంలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి ఆ జ్యూవెలరీ షాపు లక్కీ డ్రా కు అర్హత ఉంది.
మొదట లక్కీ డ్రా గురించి అంతగా ఆసక్తి చూపని చిదంబరం తరువాత 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అని అనుకుని డ్రా కుపన్ నింపి తను కొనుగోలు చేసిన బంగారముతో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో లక్కీ డ్రా నిర్వహించారు.ఈ లక్కీ డ్రాలో చిదంబరం ఏకంగా 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 8 కోట్లు) గెలుచుకున్నాడు.
అది కూడా తన నాన్న వర్ధంతి రోజున ఈ లక్కీ డ్రా తనను వరించడంతో చిదంబరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ శుభవార్త తన తల్లితో పంచుకోనీ ఆనంద పారవశ్యం చెందిన చిదంబరం గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇస్తున్నానని తన తల్లితో చెప్పి ఈ విధంగా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







