అమెరికాలో కాల్పులు..తెలంగాణ‌ విద్యార్థి మృతి

- November 30, 2024 , by Maagulf
అమెరికాలో కాల్పులు..తెలంగాణ‌ విద్యార్థి మృతి

అమెరికా: అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ (26)చనిపోయాడు.సాయితేజ ఎంఎస్ చదవడానికి 4నెలల క్రితమే యూఎస్ వెళ్లాడు.అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఖమ్మం నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయితేజ 4 నెలల క్రితం ఎంఎస్‌ చదవడానికి అమెరికా వెళ్లారు.భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి ఒంటిగంటకు షాపింగ్ మాల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయితేజపై ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్ లోని నగదుతో పారిపోయారు. అతని భౌతికకాయం ఖమ్మం నగరానికి తీసుకురావడానికి తానా ప్రతినిధులు కృషి చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com