TGPSC ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామకం
- November 30, 2024
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కమిషన్ లో కొత్త సభ్యులను నియమించగా, తాజాగా ఛైర్మన్ కూడా నియమించింది.
కాగా, ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఎం.మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.ఆయన పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 45 అప్లికేషన్లు రాగా అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫసర్లు కూడా ఉన్నారు.వారిలో బుర్రా వెంకటేశంను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నియామక ఆమోదం కోసం ఫైలును రాజ్‌భవన్‌కు పంపించింది.దీంతో శనివారం ఉదయం ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేశారు.దీంతో మరో నాలుగేండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ.. ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 2న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. 2030 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
తాజా వార్తలు
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







