యూఏఈలో ఇంధన ధరలు..డిసెంబర్ నెలలో స్వల్పంగా తగ్గుదల..!!
- November 30, 2024యూఏఈ: డిసెంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్త ధరలు డిసెంబర్ 1 నుండి వర్తిస్తాయని వెల్లడించారు. నవంబర్‌లో 2.74 దిర్హాంతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 2.61 అవుతుంది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.50( ప్రస్తుత ధర Dh2.63) అయింది. ఈ-ప్లస్ 91 పెట్రోల్ ధర నవంబర్‌లో Dh2.55తో పోలిస్తే లీటరుకు 2.43 దిర్హాములుగా నిర్ణయించారు. డీజిల్‌పై లీటరుకు 2.68 దిర్హామ్‌లు (ప్రస్తుతం 2.67 దిర్హాం)వసూలు చేయనున్నారు. తాజా ధరలు 2024లో ప్రకటించిన అత్యల్ప ధరలు కావడం గమనార్హం. ఇక మీరు నడిపే వాహనం రకాన్ని బట్టి, డిసెంబర్‌లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కు గత నెల కంటే Dh6.12 నుండి Dh9.62 వరకు తగ్గుతుంది.
నెల -సూపర్ 98 -స్పెషల్ 95 -ఇ-ప్లస్ 91
జనవరి -2.82 -2.71 -2.64
ఫిబ్రవరి -2.88 -2.76 -2.69
మార్చి -3.03 -2.92 -2.85
ఏప్రిల్ -3.15 -3.03 -2.96
మే -3.34 -3.22 -3.15
జూన్ -3.14 -3.02 -2.95
జూలై -2.99 -2.88 -2.80
ఆగస్టు -3.05 -2.93 -2.86
సెప్టెంబర్ -2.90 -2.78 -2.71
అక్టోబర్ -2.66 -2.54 -2.47
నవంబర్ -2.74 -2.63 -2.55
తాజా వార్తలు
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్‌లైన్
- దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్‌బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- అబుదాబిలో డ్రైవర్ లెస్ ఉబర్ సేవలు..ఎలా బుక్ చేయాలంటే..?
- మోటార్‌సైకిలిస్ట్ దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు..!!
- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి బిగ్ అలెర్ట్!
- దుబాయ్ 'నైట్ సఫారీ' పార్క్ సమయాలు పొడింగింపు..!!
- రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్