రియాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలు..!!
- December 02, 2024రియాద్: సౌదీ రాజధాని రియాద్ ప్రజా రవాణాలో కొత్త శకానికి నాంది పలికింది. రియాద్ మెట్రో మూడు లైన్లలో అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించింది. రియాద్ మెట్రో అనేది మధ్యప్రాచ్యంలో అతిపెద్దది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్ లేని రైలు, ఆదివారం ఉదయం ప్రయాణికులకు ఉత్కంఠబరితమైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. ప్రారంభ దశలో కార్యకలాపాలు మూడు లైన్లు 1వ లైన్ (బ్లూ లైన్); 4వ లైన్ (ఎల్లో లైన్); మరియు 6వ లైన్ (పర్పుల్ లైన్) రూట్లలో ప్రారంభమయ్యాయి.
బ్లూ లైన్ ఒలాయా స్ట్రీట్‌ను బాతాకు కలుపుతుంది.; ఎల్లో లైన్ కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రోడ్ వెంట వెళుతుంది. అయితే పర్పుల్ లైన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ అవ్ఫ్ రోడ్‌ను అల్-షేక్ హసన్ బిన్ హుస్సేన్ రోడ్‌తో కలుపుతుంది.రెండు వారాల తర్వాత డిసెంబర్ 15న, కింగ్ అబ్దుల్లా రోడ్‌ను కవర్ చేసే లైన్ 2, (రెడ్ లైన్) కింగ్ అబ్దుల్లాజీజ్ రోడ్‌ను కవర్ చేసే లైన్ 5 (గ్రీన్ లైన్) సేవలు ప్రారంభం కానున్నాయి. జనవరి 5న లైన్ 3 (ఆరెంజ్ లైన్) మదీనా రోడ్‌ను కవర్ చేస్తూ మొత్తం ఆరు లైన్‌లు అందుబాటులోకి రానుంది.
రియాద్ మెట్రో ప్రాజెక్ట్ ఆరు ప్రధాన లైన్ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 176 కిలోమీటర్ల మేర విస్తరించి 4 ప్రధాన స్టేషన్‌లతో సహా 85 స్టేషన్‌లను కలుపుతుంది. ప్రయాణీకులు రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) అందించిన డర్బ్(Darb) అప్లికేషన్ ద్వారా లేదా నేరుగా మెట్రో స్టేషన్‌లలో టిక్కెట్, లేదా వెండింగ్ మెషీన్‌ల ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. 19933 నంబర్‌లో ఫోన్ చేయడం ద్వారా మెట్రో సేవలకు సంబంధించిన వివరాలను పొందవచ్చు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ నవంబర్ 21న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. అధికారిక నివేదిక ప్రకారం.. రియాద్‌లో మెట్రో సేవలు ట్రాఫిక్ రద్దీని 30 శాతం తగ్గించవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!