చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఒమన్..!!
- December 02, 2024
మస్కట్: ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ కింద తన మొదటి ప్రయోగాత్మక సైంటిఫిక్ రాకెట్ దుక్మ్-1( Duqm-1)ను ప్రయోగించనుంది. నేషనల్ స్పేస్ సర్వీసెస్ కంపెనీలో భాగమైన ఎట్లాక్ కంపెనీ ద్వారా నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్ట్.. ఒమన్ అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఎట్లాక్ కంపెనీ మంత్రిత్వ శాఖతో కుదిరిన ఒప్పందం ద్వారా ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. రాకెట్ ప్రయోగాల కోసం స్పేస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయడానికి అల్-కహ్ల్, విలాయత్ ఆఫ్ దుక్మ్, అల్-వుస్తా గవర్నరేట్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఒమన్ ఎగ్జిక్యూటివ్ స్పేస్ సెక్టార్ ప్రోగ్రాం కింద ఈ చొరవను ఒక వ్యూహాత్మక చర్యగా రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి సెడ్ బిన్ హమూద్ అల్-మావాలి అభివర్ణించారు. ఒమన్ భౌగోళిక ప్రయోజనాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికీకరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అంతరిక్ష పరిశ్రమలో ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఇది అంతరిక్ష రంగంలో ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఒమన్ భౌగోళికంగా భూమధ్యరేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌కు సమీపంలో ఉండటంతో పాటు, ఉపగ్రహ ప్రయోగాలకు ఖర్చులు, సమయాన్ని తగ్గిస్తుందన్నారు. దీంతోపాటు ఒమన్ విస్తారమైన తీరప్రాంతం రాకెట్ ప్రయోగ కార్యకలాపాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని, డుక్మ్‌లోని స్పేస్ సేజ్ ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతుందని భావిస్తున్నారు.
దుక్మ్-1 మొదటి ప్రయోగం వచ్చే బుధవారం (18°N, 56°E కోఆర్డినేట్‌లు) షెడ్యూల్ చేశారు. 6.5 మీటర్ల రాకెట్, ఇంధనం నింపినప్పుడు 123 కిలోల బరువు, 1,530 మీ/సె వేగంతో దాదాపు 15 నిమిషాల అనంతరం సముద్ర మట్టానికి 140 కి.మీ ఎత్తుకు చేరుకుంటుంది. ఒమన్ 2025లో మూడు రాకెట్ ప్రయోగాలను ప్లాన్ చేస్తుంది. తేదీలు ఇంకా ఖరారు కాలేదు. నేషనల్ స్పేస్ సర్వీసెస్ కంపెనీ.. పూర్తిగా ఒమానీల యాజమాన్యంలో ఉంది. అంతరిక్ష రంగంలో ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించడానికి 2021లో స్థాపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..