ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం చాప్టర్ ప్రారంభించిన NATS
- December 02, 2024అమెరికా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారికి మరింత చేరువ అవుతుంది.ఈ క్రమంలోనే తాజాగా ఓమాహాలో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.ఓమాహాలోని నవాబీ హైదరాబాద్ హౌస్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఓమహాలో నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్‌గా మురళీధర్ చింతపల్లికి నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. శ్రీనివాస్ మల్లిపుడి జాయింట్ కో ఆర్డినేటర్ పదవి వరించింది. మహిళా సాధికారిత శ్రీదేవి కమ్మ, విరాళాల సేకరణ, సభ్యత్వం ప్రదీప్ సోమవరపు, వెబ్ అండ్ మీడియా శ్రీనివాసరావు, క్రీడలు సత్యనారాయణ పావులూరి, కార్యక్రమాల నిర్వహణ కృష్ణ చైతన్య రావిపాటిలకు నాట్స్ బాధ్యతలు అప్పగించింది. మనం చేసే సేవే కార్యక్రమాలే మనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని నాట్స్ ఓమహా చాప్టర్ సభ్యులు సరికొత్త సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్కో అధ్యక్షుడు మదన్రా పాములపాటి కోరారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలు మన పిల్లలతో సహా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని అన్నారు. ఓమహాలో తెలుగు వారిని ఐక్యం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల అన్నారు. ఓమహాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ ఉందనే భరోసా ఇచ్చే విధంగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని కోరారు.నాట్స్ డాక్టర్స్ హెల్ప్ లైన్ అందించిన సెకండ్ ఓపినీయన్స్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని భాను ధూళిపాళ్ల వివరించారు.నాట్స్ మెంబర్‌షిప్ నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని ఒమాహా బృందాన్ని అభినందించారు.ఓమహా బృందాన్ని అందరికి పరిచయం చేశారు.
ఓమహాలో నాట్స్ చాప్టర్‌ను స్థానికంగా ఉండే తెలుగు వారందరిని కలుపుకుని ముందుకు సాగుతుందని నాట్స్ ఓమహా చాప్టర్ కోఆర్డినేటర్ మురళీధర్ చింతపల్లి అన్నారు.. నెబ్రాస్కా విశ్వవిద్యాలయం నుండి తెలుగు ప్రొఫెసర్లు స్థానిక సంస్థల నుండి సీనియర్ తెలుగు నాయకులతో కూడిన విద్యార్థి కెరీర్ కౌన్సెలింగ్ బృందాన్ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రావుల భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి శ్రీనివాసరావు మల్లిపూడి కృతజ్ఞతలు తెలిపారు.రావు చిగురుపాటి, హిందూ దేవాలయం అధ్యక్షుడు సుందర్ చొక్కర, ప్రొఫెసర్ డాక్టర్ ఫణిలు తమను నాట్స్ జాతీయ నాయకత్వంలో భాగస్వామ్యం చేసినందుకు నాట్స్ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణ చైతన్య ఈ కార్యక్రమానికి ఆడియో వీడియో సపోర్ట్ ను అందించారు.శ్రీదేవి కమ్మ స్టేజీ డెకరేషన్‌లో సహకరించారు.ప్రదీప్ సోమవరపు, సత్య పావులూరిలు నాట్స్ మెంబర్‌షిప్ డ్రైవ్, నాట్స్ ప్రచారాన్ని ప్రారంభించారు.నవాబీ హైదరాబాద్ హౌస్‌తో సహా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి, ఒమాహాలోని తెలుగు ప్రజలందరికీ ఓమహా నాట్స్ చాప్టర్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!