సౌదీ అరేబియాలో పెద్దలు శారీరక శ్రమపై GASTAT నివేదిక..!!

- December 02, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో పెద్దలు శారీరక శ్రమపై GASTAT నివేదిక..!!

రియాద్: జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) నుండి వచ్చిన డేటా ప్రకారం.. సౌదీ అరేబియా అంతటా వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమలో 18 అంతకంటే ఎక్కువ వయస్సు గల 58.5% మంది వ్యక్తులు పాల్గొంటున్నారు.అదే సమయంలో 5 నుండి 17 సంవత్సరాల వయస్సు గల 18.7% మంది పిల్లలు, టీనేజర్స్ సిఫార్సు చేయబడిన 60 నిమిషాల రోజువారీ కార్యకలాపాలను కవర్ చేస్తున్నారు. వివిధ వయసుల వారి శారీరక ఎంగేజ్మెంట్ స్థాయిలను హైలైట్ చేస్తుంది. 
2024 ఫిజికల్ యాక్టివిటీ బులెటిన్ కింగ్‌డమ్‌లోని వివిధ జనాభాలో ఫిట్‌నెస్, జీవనశైలి విధానాలలో కీలకమైన ట్రెండ్‌లను హైలైట్ చేసింది. స్త్రీలలో 14% మందితో పోలిస్తే 23.2% మంది పురుషులు శారీరక శ్రమ మార్గదర్శకాలలో స్త్రీల కంటే ఎక్కువ చురుకుగా ఉన్నట్లు తెలిపారు.సౌదీలో 54.1%తో పోలిస్తే సౌదీయేతరులు కూడా 62.5% వద్ద అధిక ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నారు.30 నుండి 39 సంవత్సరాల వయస్సు గల పెద్దలు వారపు శారీరక శ్రమలో ముందున్నారు. 62.6% మంది 150 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సాధించారు. 
అయితే 80 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కేవలం 12.2% వద్ద మాత్రమే నివేదించారు. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో 18.7% మంది సిఫార్సు చేయబడిన రోజువారీ శారీరక శ్రమ స్థాయిలను అందుకుంటే, 35.3% మంది పాఠశాల గంటల వెలుపల ప్రతిరోజూ మూడు గంటల కంటే ఎక్కువసేపు ఎంగేజ్ అవుతున్నారు. సౌదీయేతర యువత సౌదీ కంటే కొంచెం ఎక్కువ చురుకుగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com