చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ లో విషాదం..
- June 26, 2016
చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి...అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటన స్థలికి చేరుకుని... పలువురు ప్రయాణికులను రక్షించారు.
అందులోభాగంగా వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఆయిల్ లీక్ కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని.... అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







