రోడ్డు దాటుతూ 8 ఏళ్ల బాలిక ప్రమాదంలో మృతి

- June 26, 2016 , by Maagulf
రోడ్డు దాటుతూ 8 ఏళ్ల బాలిక ప్రమాదంలో మృతి

 

షార్జ: శుక్రవారం షార్జాలో అల్ ఇస్క్ల్ల్  ప్రాంతంలో రహదారి దాటే సమయంలో ఒక కారుకు అడ్డంగా పరుగెత్తడంతో ఒక ఎనిమిది ఏళ్ల భారతీయ బాలిక మృతి చెందిందని  అధికారిక సమాచారం మా గల్ఫ్ డాట్ కామ్ కు తెలిపారు.
రాత్రి  9 గంటల సమయంలో పోలీస్ పెట్రోల్ మరియు పారామెడికల బృందాన్ని  అప్రమత్తం చేసి  ప్రమాద స్థలంకు చేరుకొన్నారు. వలస మరియు అల్ ఇస్క్ల్ల్ కూడలి  ట్రాఫిక్ సిగ్నల్ మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ బాలిక తన కుటుంబం తో  కలిసి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆ అధికారి తెలిపారు.
ప్రమాదంలో మరణించిన బాలిక తన కుటుంబంతో సహా పాదచారుల క్రాసింగ్ సమీపంలో అయినప్పటికీ ఒక రోడ్డు దాటే గుర్తులు లేని ఒక ప్రాంతం నుండి రహదారి దాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వేగవంతంగా డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు  తెలిపారు. బాలిక మృతికి కారణమైన   డ్రైవర్ ని అల్ గర్బ  పోలీసు స్టేషన్ వద్ద కస్టడీలో తీసుకొని  ప్రమాదం గూర్చి ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
రహదారి భద్రతా నియమాలు గమనించి రోడ్డు దాటాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అలాగే    రహదారులు దాటే ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని షార్జా పోలీస్ డ్రైవర్లని  కోరారు. ఇదిలా ఉంటే, ఒక భారతీయుడికి శుక్రవారం సాయంత్రం వేగంగా వచ్చే వాహనం గుద్దినట్లు పోలీసులు శనివారం చెప్పారు. ఇంటర్చేంజ్ సంఖ్య 4 వైపు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ మీద ఒక వంతెన పారిశ్రామిక వాడలో కింద జరిగింది. బాధితుడు అకస్మాత్తుగా అతను వేగవంతంగా వచ్చే వాహనం చూడకుండా రోడ్డు దాటే యత్నం చేసాడని  పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి  పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు  ఈ వ్యక్తిని  అల్ ఖ్అస్సిమి  హాస్పిటల్ యొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించారు. ఈ  ప్రమాదంపై  కారణమైన  డ్రైవర్ పోలీసుల  నిర్బంధంలో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com