ATVs కోసం.. హమద్ ట్రామా సెంటర్ సేఫ్టీ మార్గదర్శకాలు జారీ..!!
- December 04, 2024
దోహా: చల్లని వాతావరణం బహిరంగ సాహసాలను ప్రోత్సహిస్తుంది. ఔత్సాహికులు, క్యాంపర్లు మరియు ఇతర సాహసికులు వారి ఆల్-టెర్రైన్ వెహికల్స్ (ATVలు), డర్ట్ బైక్‌లు, క్వాడ్ బైక్‌లను ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. ATVలను నడుపుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హమద్ ట్రామా సెంటర్ అలెర్ట్ జారీ చేసింది. ఇసుక దిబ్బలు, ఎడారిలో రైడ్ చేసే సమయంలో భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
హమద్ ట్రామా సెంటర్‌కు చెందిన HIPP విభాగం.. క్వాడ్ బైక్‌లు లేదా ATVలపై సురక్షితంగా ఉండటానికి భద్రతా టిప్స్ జారీ చేసింది. అవుట్డోర్, క్యాంపింగ్ సీజన్ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని, సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించాలని కోరారు. ఖతార్ నేషనల్ ట్రామా రిజిస్ట్రీ, అల్ వక్రా హాస్పిటల్, హెచ్ఎంసి అంబులెన్స్ సర్వీస్ అలాగే సిద్రా మెడిసిన్ సంయుక్తంగా రూపొందించిన డేటాను HIPP వెల్లడించింది. 2017 నవంబర్ నుండి 2024 మార్చి వరకు ఆఫ్-రోడ్ వాహనాలను ఉపయోగిస్తున్నప్పుడు సీలైన్ లేదా మెసాయిద్ ప్రాంతాలలో అనేక మంది గాయపడ్డారు.
"గత రెండు క్యాంపింగ్ సీజన్లలో (2022/2023 , 2023/2024) మునుపటి సీజన్ (2021/2022)తో పోల్చితే గాయపడ్డ ATV రైడర్ల సంఖ్య తగ్గింది. అధికారులు, ఏజెన్సీలు తీసుకున్న భద్రతా చర్యల కారణంగా ఇది సాధ్యమైంది. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైనప్పటి నుండి మేము ఇప్పటికే అనేక మంది బాధితులకు చికిత్స చేసాము. ఖతార్‌లోని కొన్ని ATV రెంటల్ అవుట్లెట్లు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అద్దెకు ఇవ్వవు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సురక్షితమైన, సిఫార్సు చేయబడిన ప్రాక్టిస్. ”అని HIPP అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఐషా అబేదీ అన్నారు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







