బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో GCC మిలిటరీ షూటింగ్ ఛాంపియన్‌షిప్..!!
- December 04, 2024
మనామా: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) ఆధ్వర్యంలో మిలిటరీ స్పోర్ట్స్ యూనియన్ నిర్వహించే ప్రారంభ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) మిలిటరీ షూటింగ్ ఛాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ పోటీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్‌లతో పాటు ఆతిథ్య దేశం బహ్రెయిన్‌తో సహా GCC సభ్య దేశాల నుండి సైనిక క్రీడా సమాఖ్యలు పాల్గొంటున్నాయి. ప్రతి దేశానికి 22 మంది ప్రాతినిధ్యం వహించున్నారు.
ఈ ఛాంపియన్‌షిప్ GCC దేశాల సాయుధ దళాలలో సైనిక క్రీడలను మెరుగుపరచడం, మిలిటరీ షూటింగ్ ప్రమాణాలను పెంచడం, ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం , సాయుధ దళాల సిబ్బంది మధ్య స్నేహం, సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో రైఫిల్ ప్లేట్ షూటింగ్, పిస్టల్ ప్లేట్ షూటింగ్, మెషిన్ గన్ ప్లేట్ షూటింగ్, అధికారులకు వారియర్ పోటీ, సిబ్బందికి వారియర్ పోటీ వంటి అనేక పోటీలు ఉన్నాయి. ప్రతి పోటీలో మొదటి స్థానంలో నిలిచిన జట్లకు ట్రోఫీలు అందజేస్తారు. అన్ని ఈవెంట్‌లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుకు ఓవరాల్ ఎక్సలెన్స్ కప్‌తో పాటు.. ప్రతి పోటీలో మొదటి మూడు విజేతలకు కూడా పతకాలు అందజేస్తారు.
తాజా వార్తలు
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!







