చైనా, రష్యా SNF దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు.. సౌదీ అరేబియా
- December 04, 2024
రియాద్: చైనా, రష్యా నుండి సల్ఫోనేటెడ్ నాఫ్తలీన్ ఫార్మాల్డిహైడ్ (SNF) దిగుమతులపై ఖచ్చితమైన డంపింగ్ నిరోధక చర్యలను విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు వాణిజ్య మంత్రి మరియు జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (GAFT) ఛైర్మన్ మజేద్ అల్-కసాబీ తెలిపారు. ఈ మేరకు ఉమ్ అల్-ఖురా గెజిట్‌లో ప్రచురించారు. డిసెంబరు నుండి ఐదేళ్లపాటు ఉత్పత్తిపై చర్యలు వర్తించబడతాయని పేర్కొన్నారు. సంబంధిత ఉత్పత్తిపై 18.12 శాతం నుండి 34 శాతం పరిధిలో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించి, వసూలు చేయాలని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు. దేశీయ పరిశ్రమను రక్షించే లక్ష్యంతో అంతర్జాతీయ వాణిజ్యంలో ట్రేడ్ రెమెడీస్ చట్టం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు GAFT తెలిపింది.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







