వైభవంగా చైతూ, శోభితల సప్తపది
- December 04, 2024
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాల పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు వ్యాపారవేత్త టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రాణా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటితో పాటు పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







