బంగ్లాదేశ్: జైలు నుంచి 700 మంది ఉగ్రవాదులు పరార్
- December 05, 2024
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.మరోవైపు, షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమ సమయంలో జైళ్లను బద్దలుకొట్టడంతో దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పెద్ద ఎత్తున పరారయ్యారు.
వీరిలో కొందరిని ఆ తర్వాత పట్టుకోగా, ఇప్పటికీ 700 మంది ఆచూకీ తెలియరాలేదని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు.ఈ ఏడాది జులై 19న జరిగిన అల్లర్ల సందర్భంగా రాజధాని ఢాకాలోని నార్సింగి జైలుపై వందలాది మంది దాడిచేసి నిప్పు పెట్టి అందులోని ఖైదీలను విడిపించారు.
తప్పించుకుపోయిన ఖైదీల్లో ఆ తర్వాత దాదాపు 1500మందిని తిరిగి అదుపులోకి తీసుకోగా, ఇంకా 700మంది ఆచూకీ లేదని, వారిలో 70 మంది ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్టు వివరించారు.వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నట్టు చెప్పారు. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లిన తర్వాత బెయిలు పై బయటకు వచ్చిన ఉగ్రవాదులపై నిఘా కొనసాగుతున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







