దుబాయ్ 'నైట్ సఫారీ'..సందర్శకులకు థ్రిల్లింగ్ అనుభవం..!!
- December 11, 2024
యూఏఈ: దుబాయ్ సఫారీ పార్క్ నైట్ సఫారీ అనుభవాన్ని పొందవచ్చు. డిసెంబర్ 13 నుండి జనవరి 12వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. ఇందులో 87 విభిన్న జాతులకు చెందిన 3,000 జంతువులు ఉన్నాయి. దుబాయ్ నైట్ సఫారీలో రాత్రి సమయంలో జంతువుల సహజ ప్రవృత్తులను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. సందర్శకులు అరేబియా ఇసుక గజెల్, గంభీరమైన దక్షిణ తెల్ల ఖడ్గమృగాలు వంటి జంతువులను చూడవచ్చు. ఇవి ముఖ్యంగా రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. నైట్ సఫారీ పూర్తిగా భిన్నమైన దృక్కోణాన్ని అందిస్తుంది.
నైట్ సఫారీ సందర్భాంగా పులులు చురుకుగా ఉంటాయి. సింహాలు తమ గంభీరంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. జంతువులు సందర్శకుల వ్యాన్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు, థ్రిల్లింగ్ వాతావరణం ఏర్పడుతుంది. సందర్శకులు చల్లటి వాతావరణంలో జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూడవచ్చని దుబాయ్ మునిసిపాలిటీలోని పబ్లిక్ పార్క్స్, రిక్రియేషనల్ ఫెసిలిటీస్ డైరెక్టర్ అహ్మద్ అల్ జరౌనీ తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







