సూర్య, త్రివిక్రమ్ కాంబినేష్ కి బ్రేక్...
- June 27, 2016
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అఆ మూవీ టాలీవుడ్ లో మంచి హిట్ ని సాధించింది. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ ఏ మూవీకి డైరెక్టర్ గా చేయనున్నారు అనే విషయంపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన విషయంపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
అయితే త్రివిక్రమ్ ప్లానింగ్ ప్రకారం, నితిన్ నటించిన అఆ మూవీ తరువాత వెంటనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి పనిచేయాల్సి ఉంది. అఆ మూవీ సమయంలోనే త్రివిక్రమ్, సూర్యని కలిసి కథని చెప్పటం.తరువాత ఆ కథని డెవలప్ చేయటం వంటివి జరిగాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ పై సూర్యకి మంచి అభిప్రాయం ఉండటమే కాకుండా, సూర్య సైతం డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించేందుకు త్రివిక్రమ్ సరైన డైరెక్టర్ అని భావించారు.కానీ ప్రస్తుతం ఈ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని లేటెస్ట్ కాంబినేషన్స్ ని చూస్తుంటే త్రివిక్రమ్, సూర్యా కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్పులను చూస్తుంటే, సూర్య డైరెక్టర్ త్రివిక్రమ్ తో కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ తో పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటి వివరాలను చూస్తే, 'అట్టకత్తి', 'మద్రాస్' సినిమాలతో దర్శకుడు పా రంజిత్ మంచి పాపులర్ అయ్యారు.ఇప్పుడు రజనీకాంత్ తో రంజిత్ తెరకెక్కించిన 'కబాలి' సినిమా విపరీతమైన క్రేజ్ ని అందుకుంటుంది. ఈ మూవీ తరువాత రంజిత్, హీరో సూర్య మూవీతో కలిపి పనిచేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వస్తుందని, ఇందులో సూర్య నటించనున్నారని అంటున్నారు. దీంతో సూర్య, త్రివిక్రమ్ కాంబినేష్ కి ప్రస్తుతం బ్రేక్ పడినట్టే అని అంటున్నారు. ఈ న్యూస్ త్రివిక్రమ్ కి కొంత షాకింగ్ అని అంటున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







