శ్రీవారి భక్తులకు అలెర్ట్

- December 15, 2024 , by Maagulf
శ్రీవారి భక్తులకు అలెర్ట్

తిరుమల: వచ్చే ఏడాది తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇతర ప్రత్యేక దర్శనాలన్నింటిని రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్నీ రద్దు చేసింది. దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇవ్వనుంది. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు అనుమతి ఇస్తారు. కానీ, దర్శనం చేసుకునే అవకాశం ఉండదని టీటీడీ తెలిపింది.

భారీ క్యూలైన్లు లేకుండా ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు..

  • జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అన్ని రకాల దర్శనాలు రద్దు
  • ఆ 10 రోజుల పాటు సామాన్య భక్తులకే ప్రాధాన్యం
  • టోకెన్లు కలిగిన సామాన్య భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ రద్దు
  • చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణశాఖ, ఎన్ఆర్ఐలు, ఇతరులకు 10 రోజుల పాటు దర్శనాలు రద్దు
  • వీలైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం
  • గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఏవీ ఉండవు
  • భక్తులకు టైమ్ స్లాట్ పద్ధతిలోనే క్యూలైన్ లో దర్శనాలు
  • మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యారోక్రాట్లు, మాజీ చైర్మన్ లకు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతి లేదు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com