అరద్ ఫోర్ట్ బీచ్ పార్కులో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!

- December 16, 2024 , by Maagulf
అరద్ ఫోర్ట్ బీచ్ పార్కులో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!

మనామా: బహ్రెయిన్ జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని అరద్ ఫోర్ట్ బీచ్ పార్క్‌లో జరిగిన ముహరక్ గవర్నరేట్ వేడుకలకు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఈ కార్యక్రమం 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ చేత ఆధునిక అరబ్ , ముస్లిం రాజ్యంగా రాజ్యాన్ని స్థాపన, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనంలోకి ప్రవేశించిన వార్షికోత్సవం సందర్భంగా వేడుకలను ఏటా నిర్వహిస్తారు. 

బహ్రెయిన్ గొప్ప చరిత్ర, విజయాలు, తమ పూర్వీకుల శాశ్వత వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని HH షేక్ మొహమ్మద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ నాయకత్వంలో బహ్రెయిన్ నిరంతర అభివృద్ధి చెందుతుందన్ని తెలిపారు.    వేడుకలను ఘనంగా నిర్వహింనందుకు ముహరక్ గవర్నరేట్ బృందానికి హిస్ హైనెస్ అభినందనలు తెలిపారు.   ఈ వేడుకలో హార్స్ షో, ఇంటీరియర్ మినిస్ట్రీ వారి సంగీత ప్రదర్శన, విద్యార్థులు, జానపద సంగీత బృందాలు, కమ్యూనిటీ సంస్థల సహకారంతో సహా విభిన్న కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ హస్తకళలు, ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com