1 మిలియన్ దిర్హామ్‌ల బహుమతిని ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 16, 2024
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం 'హోప్ మేకర్' పోటీ ఐదవ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఇది సమాజానికి అందించిన మానవతా కార్యక్రమాల ఆధారంగా వ్యక్తులను గుర్తిస్తుంది. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా తమ చుట్టూ ఉన్నవారిని 'హోప్ మేకర్' పదవికి నామినేట్ చేయమని ప్రోత్సహించారు.
"ప్రతి గ్రామంలో..నగరంలో ఆశను సృష్టించడానికి, మంచిని వ్యాప్తి చేయడానికి.. వారి చుట్టూ ఉన్నవారికి మంచి చేయడానికి తమను తాము అంకితం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. వారిని గౌరవించడం, అభినందించడం, రోల్ మోడల్‌లను సృష్టించడం కోసం మేము వారి కోసం వెతుకుతున్నాము. ప్రజలలో ఆశను ప్రేరేపించడానికి 'హోప్ మేకర్స్' కొత్త సైకిల్ ను ప్రారంభించాము. ”అని షేక్ మొహమ్మద్ అన్నారు.
అర్హతలు
అనుభవం: వ్యక్తి గతంలో ఏదైనా మానవతావాద లేదా సమాజ సేవలో పనిచేసి ఉండాలి.
నైపుణ్యాలు: వ్యక్తి జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
భాష: చదవడం, రాయడం వంటి భాషలో వ్యక్తి తప్పనిసరిగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అధికారుల కథనం ప్రకారం, "ఎవరైనా తమలో లేదా ఇతరులలో మంచిని చూసే వారు తమను లేదా ఇతరులను http://arabhopemakers.com వెబ్‌సైట్ ద్వారా నామినేట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు గొప్ప సహకారాన్ని అందించిన మునుపటి విజేతల వీడియోను షేర్ చేశారు.
గత విజేతలు
-2017లో మొరాకోకు చెందిన నవాల్ అల్ సౌఫీ 200,000 కంటే ఎక్కువ మంది శరణార్థుల జీవితాలను రక్షించడంలో సహాయం చేసారు. అరబ్ హోప్ మేకర్‌గా నిలిచారు.
-కైరో వీధుల్లో నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించినందుకు ఈజిప్ట్‌కు చెందిన మహమూద్ వాహిద్ 2018లో అరబ్ హోప్ మేకర్‌గా ఎంపికయ్యాడు.
-2020లో విజేత ఎమిరాటి అహ్మద్ అల్ ఫలాసి, కెన్యాలోని మొంబాసాలో అధునాతన కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు.. ఇంక్యుబేటర్‌లను స్థాపించడంలో తన మిషన్ కోసం నిరంతరంగా పనిచేశారు.
-2024లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వందలాది మంది యువకులను, దృఢ సంకల్పం ఉన్న పిల్లలను చూసుకునే ఇరాకీ ఫార్మసిస్ట్ తలా అల్ ఖలీల్ ప్రతిష్టాత్మక అవార్డు విజేతగా నిలిచారు. మరో ముగ్గురు ఫైనలిస్ట్‌లకు వారి మానవతావాద పనిని కొనసాగించడానికి ఒక్కొక్కరికి Dh1 మిలియన్లు కూడా ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







