స్విగ్గీ కొత్త యాప్‌..

- December 16, 2024 , by Maagulf
స్విగ్గీ కొత్త యాప్‌..

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ కొత్తతరహా సేవల్ని శ్రీకారం చుట్టింది.ఇప్పటికే క్విక్‌ కామర్స్‌ విభాగంలో రాణిస్తున్న సంస్థ తాజాగా.. డైనింగ్‌, లైవ్‌ ఈవెంట్లు, టికెట్‌ బుకింగ్ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది.దీని కోసం Scenes పేరిట ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే జొమాటో..డిస్ట్రిక్ట్‌ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.ఈ అప్లికేషన్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌, డైనింగ్‌ తరహా సేవలు అందిస్తోంది.ఈ విభాగంలో తన సత్తా చాటుకొనేందుకు స్విగ్గీ ముందుకొచ్చింది. అందులోభాగంగానే తాజాగా Scenes అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. దీని సాయంతో పార్టీలు, లైవ్‌ మ్యూజిక్‌, డీజే నైట్స్‌, పార్టనర్‌ రెస్టరంట్‌లలో జరిగే మరిన్ని ఈవెంట్‌ల కోసం టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.దీంతో పాటు అనేక సదుపాయాలు ఈ కొత్త యాప్‌లో ఉన్నాయని స్విగ్గీ చెబుతోంది. అయితే డిస్ట్రిక్ట్‌ యాప్‌ తరహా సినిమా టికెట్లను విక్రయించే సదుపాయం ఇందులో లేదని స్పష్టం చేసింది.ఈ కొత్తతరహా సదుపాయం ద్వారా స్విగ్గీ ఆదాయం పెరుగుతుందని, యూజర్ల సంఖ్యను పెంచుకోవడంలో సాయపడుతుందని ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ తెలిపింది. తొలుత ఈ సేవలు బెంగళూరులో ప్రారంభం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com