2025లో దుబాయ్‌లో అద్దెలు తగ్గుతాయా?

- December 16, 2024 , by Maagulf
2025లో దుబాయ్‌లో అద్దెలు తగ్గుతాయా?

దుబాయ్‌: కొత్త ప్లాట్లు మార్కెట్‌లోకి వచ్చినందున దుబాయ్‌లోని కొన్ని పాత భవనాల్లో అద్దెలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  పాత భవనాల యజమానులు బలమైన ఆక్యుపెన్సీని నిర్వహించడానికి కొన్ని ప్రోత్సాహకాలను అందించాల్సి ఉంటుందని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అధికారులు భావిస్తున్నారు. 2025లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాలలో అద్దెలు తగ్గవచ్చని పేర్కొన్నారు. దీంతోపాటు దీర్ఘకాలిక అద్దెలు, కొత్త అద్దెదారులను ఆకర్షించడానికి ఆస్తుల పునరుద్ధరణ 2025లో దుబాయ్‌లో అద్దెదారు-యజమాని సంబంధాలపై ప్రభావం చూపుతుందని, భావిస్తున్నారు.దీంతో అద్దెలు క్రమంలో తగ్గుతాయని అంటున్నారు.  అయితే, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అద్దెలు పెరుగుతూనే ఉంటాయని పరిశ్రమ నిర్వాహకులు నమ్ముతున్నారు. ఎమిరేట్‌లో అద్దెలు 2025లో దాదాపు 10 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.  

బెటర్‌హోమ్స్ లీజింగ్ డైరెక్టర్ రూపర్ట్ సిమండ్స్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా పెరుగుతున్న అద్దె ధరల నుండి భూస్వాములు ప్రయోజనం పొందారని అన్నారు. అయితే, ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న మాదిరిగా వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉండదు. రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టుల రాకతో అద్దెలు కాస్తా అందుబాటులోకి చవ్చే అవకాశం ఉందన్నారు.  

వాల్యుస్ట్రాట్‌లోని రియల్ ఎస్టేట్ రీసెర్చ్ డైరెక్టర్, హెడ్ హైదర్ తుయిమా మాట్లాడుతూ.. కొంతమంది విల్లా యజమానులు మరిన్ని చెక్ చెల్లింపులను అనుమతించవలసి ఉంటుందని, కొత్త అద్దెదారులను ఆకట్టుకునేందుకు వారి ఆస్తులను పునరుద్ధరించాల్సి ఉంటుందని అన్నారు. అక్యూబ్ డెవలప్‌మెంట్స్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌జీ అయ్యర్ మాట్లాడుతూ.. ఎమిరేట్‌లో హాలిడే రెంటల్స్ సెక్టార్‌కి కూడా ఎక్కువ ఓపెన్‌నెస్ ఉంటుందన్నారు.  కాగా, 2025లో దుబాయ్‌లో అద్దెలు గణనీయంగా తగ్గే అవకాశం లేదని రామ్‌జీ అయ్యర్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com