అబుదాబిలో రెసిడెంట్ పార్కింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- December 16, 2024
యూఏఈ: అబుదాబిలోని నివాసితులు రోజులోని కొన్ని గంటలలో వారి ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. నివాసితుల పార్కింగ్ పర్మిట్ లేదా మవాకిఫ్ పార్కింగ్ పర్మిట్ అని పిలుస్తారు. ఇది ఇంటి యజమానులు, అద్దెదారులు తమ కమ్యూనిటీలో రాత్రి 9 నుండి ఉదయం 8 గంటల వరకు పార్కింగ్ స్థలాన్ని రిజర్వ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. రోజులోని ఇతర గంటలలోఈ ఖాళీలను సందర్శకులు, అనుమతి లేనివారు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత ఉపయోగించవచ్చు. వీటిని బ్లూ లైన్ తో లేదా ‘రెసిడెంట్ పర్మిట్ ఓన్లీ’ మవాకిఫ్ సంకేతాలతో తెలియజేస్తారు. అపార్ట్మెంట్ , విల్లా ప్రాంతాలు రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అదే నివాసంలో నివసిస్తున్న మొదటి లేదా రెండవ-స్థాయి బంధువులు కూడా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అబుదాబిలో ఉచిత పార్కింగ్ ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలలో అందుబాటులో ఉంటుంది.
అనుమతికి కావాల్సిన డాక్యుమెంట్స్: విద్యుత్ బిల్లు, ఎమిరేట్స్ ID, అద్దె ఒప్పందం, వాహన ఆర్సీ.
నివాసితుల పార్కింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే రుసుము యూఏఈ జాతీయుల నుండి ప్రవాస నివాసితులకు భిన్నంగా ఉంటుంది. అపార్ట్మెంట్లలో గరిష్టంగా నాలుగు వాహనాల కోసం దరఖాస్తు చేసుకునే యూఏఈ పౌరులకు పర్మిట్ ఉచితం. విల్లా ప్రాంతాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు కూడా ఉచితం. అదే, ప్రవాస నివాసితుల కోసం, మొదటి వాహనానికి పర్మిట్ పొందడానికి 800 Dh, అదనపు వాహనం కోసం పర్మిట్ పొందడానికి ధర Dh1,200 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రక్రియ
నివాసితులు అబుదాబి TAMM ప్లాట్‌ఫారమ్ ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు, వారు ఇప్పటికే ఉన్న అన్ని పార్కింగ్ జరిమానాలు చెల్లించాలి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు