భయాందోళనలు కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు.
- June 27, 2016
ఒమన్‌లో రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమైపోవడంతో వాటిని నివారించేందుకు రోడ్లను విస్తరించడం, రౌండ్ ఎబౌట్స్ని ఏర్పాటు చేయడమొక్కటే మార్గంగా కనిపిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారిక వర్గాలు వివరించాయి. తాత్కాలికంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి&్సన అవసరం ఉందని ఒమన్ షురా కౌన్సిల్ మెంబర్ మొహమ్మద్ అల్ హిజ్రి చెప్పారు. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 675 మంది మృతి చెందారు. మొత్తం 6,276 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జులైలో అత్యధికంగా 51 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. 406 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెలలో 626 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనంతో పలు ప్రాజెక్టులు ముందుకు కదలలేకపోతున్నాయి
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







