ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే పర్యాటకుల కోసం VAT రీఫండ్..!!

- December 17, 2024 , by Maagulf
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే పర్యాటకుల కోసం VAT రీఫండ్..!!

యూఏఈ: యూఏఈలోని పర్యాటకులు తమ దేశంలో ఉన్న సమయంలో చేసిన ఇ-కామర్స్ కొనుగోళ్లపై త్వరలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని తిరిగి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త ఇ-కామర్స్ VAT రీఫండ్ సిస్టమ్ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA)తో రిజిస్టర్ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌లు,  ఇ-స్టోర్‌లు యూఏఈలో ఉన్నప్పుడు పర్యాటకులు వారి ఆన్‌లైన్ కొనుగోళ్లపై VAT రీఫండ్‌లను పొందవచ్చు. కొత్త పన్ను విధానం పర్యాటకుల కోసం కొనుగోలు నుండి రీఫండ్ వరకు ప్రక్రియను సులభతరం చేస్తుందన్నారు.

యూఏఈలోని పర్యాటకులు నేరుగా రిజిస్టర్డ్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా VAT వాపసు అభ్యర్థనలను సమర్పించవచ్చు. ట్రావెల్ డాక్యుమెంట్స్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. పర్యాటకుల గుర్తింపు ధృవీకరించబడిన తర్వాత, వారు దేశం విడిచి వెళ్లినప్పుడు రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుంది.   రెండేళ్ళ క్రితం ప్రారంభించిన డిజిటల్ ట్యాక్స్ రీఫండ్ సిస్టమ్‌ విజయవంతం కావడంతో కొత్త విధానాన్ని రూపొందించారు. ఇది వాపసు ప్రక్రియను వేగంగా చేస్తుందని అధికారులు తెలిపారు. కొత్త స్కీమ్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా యూఏఈ ఖ్యాతిని మరింత పెంచుతుందని FTA డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com