ఖతార్ జాతీయ దినోత్సవం..PHCC ఆరోగ్య కేంద్రాల పని వేళల్లో మార్పులు..!!
- December 17, 2024
దోహా: ఖతార్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) పనివేళల్లో మార్పులను ప్రకటించింది. డిసెంబర్ 18, 19 తేదీల్లో ఆరోగ్య కేంద్రాల కార్యాచరణ షెడ్యూల్ను విడుదల చేసింది. 31 ఆరోగ్య కేంద్రాల్లో 20 కేంద్రాలు సెలవు రోజుల్లో పనిచేస్తాయని ఒక ప్రకటనలో పిహెచ్సిసి తెలిపింది. పనిచేసే కేంద్రాలలో అల్ వక్రా, విమానాశ్రయం, అల్ ముంతాజా, ఒమర్ బిన్ అల్ ఖత్తాబ్, వెస్ట్ బే, అల్ తుమామా, అల్ సద్ద్, రౌదత్ అల్ ఖైల్, లీబైబ్, ఉమ్ సలాల్, ఘరాఫా అల్ రయాన్, ఖలీఫా సిటీ, అబూ బకర్ అల్ సిద్ధిక్, అల్ రయాన్, మెస్సైమర్, ముయాతిర్, అల్ ఖోర్, అల్ రువైస్, అల్ షీహనియా ఉన్నాయి.
అల్ జుమైలియా హెల్త్ సెంటర్ 24 గంటల ఆన్-కాల్ సిస్టమ్లో పనిచేస్తుంది. వైద్య సహాయక సేవలు ఉదయం 7 నుండి రాత్రి 11 గంటల వరకు నిరంతరంగా అందజేస్తారు. అలాగే పైనర్కొన్న కేంద్రాలలో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు దంత సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇక ఉమ్ ఘువాయిలీనా, సౌత్ అల్ వక్రా, అల్ ఘువైరియా, అల్ ధాయెన్, ఖతార్ యూనివర్శిటీ, అల్ వాజ్బా, అల్ వాబ్, అబు నఖ్లా, ఉమ్ అల్ సెనీమ్ వంటి 11 ఆరోగ్య కేంద్రాలు జాతీయ దినోత్సవం సందర్భంగా సెలవులు ప్రకటించారు. అయితే, అల్ కాబాన్, అల్ కరానా కేంద్రాలు అత్యవసర కేసులను మాత్రమే స్వీకరిస్తారని తెలిపారు. అల్ రయాన్ హెల్త్ సెంటర్లోని వివాహానికి ముందు వైద్య పరీక్షల క్లినిక్ డిసెంబర్ 18 ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు పని చేస్తుంది. లీబైబ్ ఆరోగ్య కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వివాహానికి ముందు పరీక్ష అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఘరాఫా అల్ రయాన్, అల్ షీహనియా, అబూ బకర్ అల్ సిద్ధిక్, రౌదత్ అల్ ఖైల్, అల్ కబాన్, అల్ కరానా, అల్ రువైస్, ఉమ్ సలాల్, లీబైబ్, ముయాతిర్, అల్ ముంతాజాతో సహా 12 ఆరోగ్య కేంద్రాలలో పెద్దలకు అత్యవసర సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. అల్ రువైస్, ఉమ్ సలాల్, లీబైబ్, ముయాతిర్, అల్ ముంతాజా, అల్ సద్ కేంద్రాలలో పీడియాట్రిక్ అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. 16000 నంబరులో కమ్యూనిటీ సంప్రదింపు కేంద్రం 24/7 ఫోన్ యాప్ ద్వారా వైద్య సంప్రదింపు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …