సౌదీ అరేబియాలో ఇంజనీరింగ్ ఉద్యోగుల కోసం కొత్త పే స్కేల్..!!

- December 18, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో ఇంజనీరింగ్ ఉద్యోగుల కోసం కొత్త పే స్కేల్..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం కొత్త పే స్కేల్ అమల్లోకి రానుంది. కొత్త జీతం స్కేల్ ప్రభుత్వ రంగంలోని ఇంజనీరింగ్ నిపుణులకు ఆకర్షణీయమైన, ఉత్తేజకరమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుందని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఇంజనీర్ల వృత్తిపరమైన ప్రమాణాలను కూడా పెంచుతుందని పేర్కొంది. సౌదీ కేబినెట్ ఆమోదించిన ఇంజినీరింగ్ ఉద్యోగాల కొత్త జీతం స్కేల్.. డిసెంబర్ 31  నుండి అమలులోకి వస్తుంది. ఇది సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ ప్రకారం.. ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులకు వర్తించనుంది.  

సౌదీ అరేబియా లోపల లేదా రాజ్యానికి వెలుపల ఉన్న గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లలో ఒకదాని నుండి బ్యాచిలర్ డిగ్రీలు కలిగి ఉన్నవారికి, సాధారణ ఉద్యోగి జీతం స్కేల్‌లో పేరోల్‌లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. కొత్త స్కేల్‌లో పురోగతి సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ పొందడంతో పాటు, ఇంజినీరింగ్ ప్రొఫెషన్స్ ప్రాక్టీస్ లా ప్రకారం ఇంజనీర్, అసోసియేట్ ఇంజనీర్, ప్రొఫెషనల్ ఇంజనీర్,  కన్సల్టింగ్ ఇంజనీర్ వంటి నిర్దిష్ట ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ వర్గాలకు అనుగుణంగా ఉంటుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com