విద్యార్ధులకు ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్
- December 19, 2024
ముంబై: విద్యార్ధులకు ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రత్యేక తగ్గింపు ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు బుధవారం నాడు తెలిపింది. విద్యార్ధులకు బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు రాయితీ ఇవ్వడంతో పాటు, అదనంగా 10 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్లు వస్తాయి. వీటితో పాటు ప్రయాణ తేదీని ఒక సారి ఉచితంగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ప్రత్యేక ఛార్జీలు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్యాబిన్స్ అందుబాటులో ఉంటాయి. భారత్‌లోని 49 నరాలకు, విదేశాల్లో 42 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా సర్వీస్‌లు నడిపిస్తోంది.
అంతర్జాతీయ రూట్లలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించే విద్యార్ధులు కూడా ఈ ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. ఎయిర్ ఇండియా మొబైల్ యాప్‌పై టికెట్లు బుక్ చేసుకునేన వారికి ఇప్పటికే ఎలాంటి బుకింగ్ ఛార్జీలు వసూలు చేయడంలేదు. దీని వల్ల దేశీయ రూట్లలో 399 రూపాయలు, ఇంటర్నేషనల్ రూట్లలో 999 రూపాయలను ఆదా చేసుకోవచ్చు.
ఎయిర్ ఇండియా భాగస్వామ్యంతో జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా మరింత రాయితీ పొందవచ్చు.మహారాజా క్లబ్లో నమోదు చేసుకోవడం ద్వారా రివార్డు పాయింట్లు కూడా పొందవచ్చని తెలిపింది.ఈ ఆఫర్లు పొందడానికి 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు విద్యార్ధులు అర్హులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







