సౌదీ లో భారతీయుల పాట్లు
- June 27, 2016
సౌదీలో ఓ కంపెనీ చేసిన మోసంతో దాదాపు 4500 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో 200 మంది హైదరబాదీయులు కూడా ఉన్నారు. సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్(ఎస్‌బీజీ) అనే నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న వీరికి ఆరు నెలలుగా కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వారిలో కొందరు యాచనకు దిగుతున్నారు. కంపెనీ వద్ద కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను తిరిగి సురక్షితంగా స్వదేశం పంపాలని బాధితులు కోరుతున్నారు.
''కంపెనీ ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తిండీ కూడా లేదు. జీతాలు అడిగేందుకు వెళితే దాడి చేస్తున్నారు. మాకేం చేయాలో పాలుపోవడం లేదు. వెంటనే భారత ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. క్షేమంగా స్వదేశం చేర్చాలి'' అని కోల్‌కతాకు చెందిన రషీద్ భారత ప్రభుత్వాన్ని కోరాడు.
సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్ నిర్మించిన ఓ బ్రిడ్జి నాలుగు నెలల క్రితం కూలిపోవడంతో ప్రభుత్వం ఆ కంపెనీ కాంట్రాక్టును రద్దుచేసింది. దీంతో కంపెనీ పలువురు ఉద్యోగులను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారి వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించింది. దీంతో కార్మికులు కఫీల్(లేబర్ కాంట్రాక్టర్లు)ను ఆశ్రయించగా వారు కంపెనీతో మాట్లాడుకోవాలని చెబుతున్నారని, వారిని అడిగితే ఇచ్చేది లేదు పొమ్మంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తిరిగి స్వదేశాలకు వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవని, పాస్‌పోర్టులు కూడా కాంట్రాక్టర్ల వద్దే ఉన్నాయని పేర్కొన్నారు.
ఓ హైదరాబాద్ కార్మకుడు మాట్లాడుతూ చేతిలో డబ్బులు లేకపోవడంతో బతికేందుకు యాచించాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 200 మంది ఇక్కడ చిక్కుకుపోయినట్టు ఆయన వివరించారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయంలో స్పందించి తమను తిరిగి హైదరాబాద్ రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







