నందు 'కన్నుల్లో నీ రూపమే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
- June 27, 2016

యంగ్ హీరో నందు, క్యూట్ గాళ్ తేజస్విని ప్రకాశ్ జంటగా తెరకెక్కుతున్న 'కన్నుల్లో నీ రూపమే'. బిక్స్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఇ.రాజమౌళి సమర్పణలో ఎ.ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకంపై భాస్కర్ బాసాని ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాకేత్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే పలువురు సినీప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న 'కన్నుల్లో నీ రూపమే' సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో 12రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
'కన్నుల్లో నీ రూపమే' ఫేమ్ తేజస్విని ప్రకాశ్ కి సైమా అవార్డ్
తాజాగా సైమా అవార్డ్స్ 2016కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో హీరోయిన్ తేజస్విని ప్రకాశ్ ఎంపికవ్వడం విశేషం. కన్నడ హిట్ మూవీ 'గూలిహత్తి' సినిమాలో అద్భుతమైన నటనకనబర్చిన తేజస్వి ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ఉత్సాహంతో తదుపరి షెడ్యూల్ ను పూర్తి చేసుకునేందుకు సిద్ధం అవుతోంది 'కన్నుల్లో నీ రూపమే' టీమ్.



తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







