యూఏఈలో జనవరి నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ ఫీజు..!!
- December 20, 2024
యూఏఈ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ నెట్‌వర్క్.. UAEV, దాని కొత్త టారిఫ్‌లు జనవరి నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం.. DC ఛార్జర్‌లు ప్రతి kWhకి Dh1.20ప్లస్ VAT, AC ఛార్జర్‌లు ప్రతి kWhకి Dh0.70 ధరతో పాటు VAT ఉంటుందన్నారు. అయితే, మేలో టారిఫ్‌లను తొలిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుంచి EV ఛార్జింగ్ సేవలు ఉచితంగానే అందించబడుతున్నాయని గుర్తు చేశారు. తదుపరి ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం, లైవ్ స్టేటస్ అప్‌డేట్‌లు, సాధారణ చెల్లింపు ఎంపికలు వంటి ఫీచర్‌లను అందించడానికి UAEV మొబైల్ అప్లికేషన్‌ను పరిచయం చేస్తోంది.
UAEV తక్షణ మద్దతు, సహాయాన్ని అందించడానికి, అన్ని సమయాల్లో సేవలు అందించడానికి అంకితమైన 24/7 కాల్ సెంటర్‌ను ప్రారంభిస్తోందని UAEV చైర్మన్ షరీఫ్ అల్ ఒలామా అన్నారు. 2030 నాటికి, UAEV నెట్‌వర్క్ యూఏఈలోని అర్బన్ హబ్‌లు, హైవేలు, ట్రాన్సిట్ పాయింట్‌లలో వ్యూహాత్మకంగా ఉన్న 1,000 ఛార్జర్‌లను కలిగి ఉంటుందని, ఇంటర్-సిటీ, ఇంట్రా-సిటీ EV వినియోగదారులకు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







