సౌదీ అరేబియాలో 89 రోజుల సుదీర్ఘ వింటర్ సీజన్ ప్రారంభం..!!
- December 22, 2024
జెడ్డా: జెడ్డా ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రకారం.. సౌదీ అరేబియాలో 89 రోజుల పాటు ఉండే వింటర్ సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుతిరిగి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల వింటర్ సీజన్ ఏర్పడుతుందని అసోసియేషన్ అధినేత మజేద్ అబు జహ్రా తెలిపారు. ఉత్తర అర్ధగోళం సూర్యుని నుండి దూరంగా వంగి ఉంటుందని, పగటి సమయం తక్కువగా ఉంటుందని, అయితే దక్షిణ అర్ధగోళంలో పగటి వెలుతురు ఎక్కువగా ఉంటుందన్నారు. భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న అన్ని ప్రదేశాలలో పగటి నిడివి 12 గంటల కంటే తక్కువగా ఉంటుందని, భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలు 12 గంటల కంటే ఎక్కువగా నిడివి కలిగి ఉంటాయన్నారు.
నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రకారం.. ఉత్తర సరిహద్దు ప్రాంతాలైన టబుక్, అల్-జౌఫ్, హేల్‌తో సహా ఆదివారం నుండి మంగళవారం వరకు ఉష్ణోగ్రత జీరో నుండి 4 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. రియాద్, తూర్పు ప్రావిన్స్, మక్కా, మదీనా ప్రాంతాలతో పాటు నజ్రాన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. అదే సమయంలో జజాన్, అసిర్, అల్-బహా ప్రాంతాలలో తేలికపాటి వర్షం, పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







