6 నెలల లోపు రెండోసారి బేసిక్ కమోడిటీల ధరలను పెంచలేరు..!!
- December 25, 2024
యూఏఈ: వచ్చే ఏడాది నుంచి బేసిక్ కమోడిటీల ధరలను వరుసగా రెండుసార్లు పెంచే మధ్య కనీసం ఆరు నెలల వ్యవధిని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వినియోగదారులను రక్షించడానికి, పోటీని పెంచడానికి దేశంలోని రిటైలర్లు ముందస్తు అనుమతి లేకుండా తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను పెంచలేరని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వస్తువులలో వంట నూనె, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ఉన్నాయి. కొత్త మార్పులు జనవరి 2, 2025 నుండి అమలులోకి వస్తాయి.
నిత్యావసర వినియోగ వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు గతంలో ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. స్థానిక అధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిత్యావసర వినియోగ వస్తువుల సరఫరాదారులు, రిటైలర్లు, డిజిటల్ వ్యాపారులు.. వినియోగదారుల కోసం కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారం.. రిటైల్ దుకాణాలు పారదర్శకతను ప్రోత్సహించడానికి యూనిట్ ధరలను ప్రదర్శించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







