2024లో రికార్డు సృష్టించిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..!!

- December 26, 2024 , by Maagulf
2024లో రికార్డు సృష్టించిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..!!

మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (BIA) 2024 మొదటి పదకొండు నెలల్లో అద్భుత పనితీరును నివేదించింది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ప్రయాణీకుల రద్దీ, విమానాల కదలికలు, విమాన రవాణాలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. రవాణా మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా ఈ ప్రాంతంలో విమాన ప్రయాణం, సరుకు రవాణా కోసం పెరిగిన డిమాండ్ ను తెలియజేసింది. అదే సమయంలో ప్రయాణీకుల ట్రాఫిక్‌లో పూర్తి పునరుద్ధరణను ప్రతిబింబించే బలమైన మొమెంటంను హైలైట్ చేస్తుందన్నారు.

BIAలో మొత్తం ప్రయాణీకుల సంఖ్య జనవరి నుండి నవంబర్ 2024 వరకు 8.71 మిలియన్లకు చేరుకుంది. 2023లో ఇదే కాలంలో 8.01 మిలియన్లుగా ఉంది. అలాగే, వచ్చే ప్రయాణీకులు 8.7% పెరిగి 4.36 మిలియన్లకు, బయలుదేరే ప్రయాణీకులు 9.8%కి పెరిగి4.35 మిలియన్లకు చేరుకున్నారు. ట్రాన్సిట్ ప్రయాణీకులు 267.7% పెరుగుదలను నమోదు చేసింది. గత సంవత్సరంలో 4,960 మందితో పోలిస్తే మొత్తం 18,249 మంది ఈ సేవలను వినియోగించుకున్నారు.  విమానాల కదలికలు కూడా 7% పెరిగాయి. 2024 మొదటి పదకొండు నెలల్లో మొత్తం 50,530 విమానాలు ఉండగా, 2023లో 47,213 విమానాలు వచ్చాయి. వచ్చిన విమానాలు 25,460 (+7%), బయలుదేరే విమానాల సంఖ్య 25,0170 (+7. %) గా నమోదైంది.

సరుకు రవాణా పరిమాణం 16.9% పెరుగుదలతో 364,800 టన్నులకు చేరుకుంది.  గత సంవత్సరం ఇదే కాలంలో 312,200 టన్నులుగా ఉంది. ఇన్‌బౌండ్ సరుకు రవాణా 17.8% పెరిగి 120,700 టన్నులకు, అవుట్‌బౌండ్ సరుకు 25.5% పెరిగి 79,200 టన్నులకు, రవాణా సరుకు 12.5% వృద్ధిని సాధించి 164,900 టన్నులకు చేరుకుంది. నవంబర్ 2023తో పోలిస్తే నవంబర్ 2024లో మొత్తం ప్రయాణీకుల సంఖ్య 729,555కి స్వల్పంగా 1% తగ్గుదల కనిపించగా, విమాన సరుకు రవాణాలో 24% బలమైన వృద్ధిని సాధించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com