త్వరలో విడుదల కానున్న 69 మంది భారతీయ ఖైదీలు
- June 28, 2016
అబుదాబి జైలులో మగ్గుతున్న 69 మంది భారతీయులు త్వరలో విడుదల కానున్నారు. పవిత్ర రమదాన్ సందర్భంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని యూఏఈ నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ వారికి క్షమాభిక్ష ప్రసాదించారు. మొత్తం 1,010 మందికి క్షమాభిక్ష ప్రసాదించగా వారిలో 69 మంది భారతీయులు ఉన్నారు. అల్ వత్బా జైలు నుంచి 69 మంది భారతీయులను విడుదల చేయనున్నట్టు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందినట్టు భారత అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. అయితే అంతకుమించి సమాచారం లేదని పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా దాదాపు వెయ్యిమంది భారతీయులు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నట్టు భారత రాయబారి సీతారామ్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







