త్వరలో విడుదల కానున్న 69 మంది భారతీయ ఖైదీలు

- June 28, 2016 , by Maagulf
త్వరలో విడుదల కానున్న 69 మంది భారతీయ ఖైదీలు

అబుదాబి జైలులో మగ్గుతున్న 69 మంది భారతీయులు త్వరలో విడుదల కానున్నారు. పవిత్ర రమదాన్ సందర్భంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని యూఏఈ నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ వారికి క్షమాభిక్ష ప్రసాదించారు. మొత్తం 1,010 మందికి క్షమాభిక్ష ప్రసాదించగా వారిలో 69 మంది భారతీయులు ఉన్నారు. అల్ వత్బా జైలు నుంచి 69 మంది భారతీయులను విడుదల చేయనున్నట్టు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందినట్టు భారత అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. అయితే అంతకుమించి సమాచారం లేదని పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా దాదాపు వెయ్యిమంది భారతీయులు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నట్టు భారత రాయబారి సీతారామ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com