Dh641 మిలియన్ల మనీలాండరింగ్.. ఇంటర్నేషనల్ నెట్‌వర్క్స్ బస్ట్..!!
- December 27, 2024
యూఏఈ: మొత్తం Dh641 మిలియన్ల విలువైన మనీ-లాండరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెండు ప్రధాన అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్‌లను దుబాయ్‌లోని అధికారులు ఛేదించారు.
మొదటి కేసులో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ఎమిరాటీ, 21 మంది బ్రిటీష్ పౌరులు, ఇద్దరు అమెరికన్లు, ఒక చెక్ జాతీయులు, ఎమిరాటీ జాతీయుడికి చెందిన రెండు కంపెనీలను దుబాయ్ కోర్టులలోని క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌కు రెఫర్ చేసింది. ఆయా సంస్థలు Dh461 మిలియన్ల అక్రమ నిధులను కలిగి ఉన్నారని, అలాగే అధికారిక పత్రాలను ఫోర్జరీ చేయడం, వాటిని ఉపయోగించడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. తమ అక్రమ మూలాలను మరుగుపరిచేందుకు రెండు స్థానిక కంపెనీలను ముందుంచుకుని యుకె నుండి యూఏఈకి నిధులు అక్రమంగా తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నెట్‌వర్క్ నకిలీ పత్రాలను ఉపయోగించిందని గుర్తించారు.UKలో చట్టబద్ధమైన వాణిజ్యం నుండి వచ్చిన నిధులను తప్పుగా ప్రకటించడం ద్వారా కస్టమ్స్ తనిఖీలను తప్పించుకున్నట్లు విచారణలో గుర్తించారు.
అధికారులు జరిపిన మరో విజయవంతమైన ఆపరేషన్‌లోDh180 మిలియన్ల విలువైన మనీలాండరింగ్ కార్యకలాపాలలో క్రిప్టోకరెన్సీలను ఉపయోగించిన అంతర్జాతీయ వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్ ఛేదించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 30 మంది వ్యక్తులు, మూడు కంపెనీల నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసును దుబాయ్ కోర్టులలోని మనీ లాండరింగ్ కోర్టుకు రిఫర్ చేసింది. క్రిప్టోకరెన్సీలను ఉపయోగించి Dh180 మిలియన్ల విలువైన సంక్లిష్ట మనీలాండరింగ్ కార్యకలాపాలను నిర్వహించిన ఈ నెట్‌వర్క్ UK, దుబాయ్‌లో పనిచేసింది. UK , దుబాయ్‌లో ఉన్న లైసెన్స్ లేని క్రిప్టోకరెన్సీ మధ్యవర్తుల ద్వారా UKలో నెట్‌వర్క్ నగదును లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఇద్దరు భారతీయులు, ఒక బ్రిటీష్ జాతీయుడు ఉన్నాడు. UKలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసం, పన్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమ పద్ధతుల్లో తరలించారు. పక్కాగా ప్లాన్ చేసిన ఆపరేషన్ నిందితులను అరెస్టు చేసి మనీలాండరింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసారు.
దుబాయ్‌లోని పబ్లిక్ ఫండ్స్ ప్రాసిక్యూషన్, దుబాయ్ ఎకనామిక్ సెక్యూరిటీ సెంటర్, దుబాయ్ పోలీస్ యాంటీ మనీ లాండరింగ్ యూనిట్, యూఏఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, దుబాయ్ కస్టమ్స్, యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖలోని అంతర్జాతీయ సహకార విభాగం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







