'ఓం నమోవెంకటేశాయ'. ముహూర్తం షాట్ దిగ్విజయం..
- June 28, 2016
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో ఇప్పటికి మూడు భక్తిరస చిత్రాలు విడుదలయ్యాయి. వీరి కలయికలో వస్తున్న నాల్గో చిత్రం 'ఓం నమోవెంకటేశాయ'. ఈ చిత్రం ముహూర్తం షాట్ దిగ్విజయంగా మొదలైందని రాఘవేంద్రరావు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి సమక్షంలో నాగార్జున, పూజారులు తదితరులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'ఓం నమో వెంకటేశాయ 25వ తారీఖున ముహూర్తం షాట్ దిగ్విజయంగా మొదలైంది. నేను నమ్మే ఆ స్వామి కృప వలన ఇప్పటివరకు నా జీవితంలో చాలా మంచి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి కూడా అంతే మంచే జరుగుతుందని, ఆ స్వామి వారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం' అని రాఘవేంద్రరావు పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.v
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







