యూఏఈలో మెడిసిన్, ఫార్మసీల నియంత్రణకు కొత్త చట్టం..!!
- December 29, 2024
యూఏఈ: వైద్య ఉత్పత్తులు, ఫార్మసీలు, ఫార్మాస్యూటికల్ వ్యాపారాలను నియంత్రించడానికి కొత్త చట్టాన్ని యూఏఈ ప్రవేశపెట్టింది. ఈ చట్టంలో వైద్య పరికరాలు, ఔషధ ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ వస్తువులు, జీవసంబంధ ఉత్పత్తులు, సప్లిమెంట్లు,సౌందర్య సాధనాలు ఉన్నాయి. ఇది ఫ్రీ జోన్‌లతో సహా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బయోబ్యాంక్‌లు, ఫార్మాస్యూటికల్ సంస్థలను నియంత్రిస్తుంది.
కొత్త చట్టం ద్వారా ఫార్మాస్యూటికల్ సంస్థల పర్యవేక్షణ, బయోబ్యాంక్‌లకు లైసెన్స్ ఇవ్వడం, యాజమాన్య బదిలీలను పరిష్కరించడం, ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, స్థానిక ఆరోగ్య అధికారుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినవారి లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం, ముందుజాగ్రత్తగా మూసివేయడం, లైసెన్స్ రద్దు చేయడంతోపాటు ఆయా సంస్థలకు Dh1 మిలియన్ వరకు జరిమానాలు, ప్రాక్టిషనర్స్ కు Dh500,000 ఫైన్, క్రమశిక్షణా చర్యలను తీసుకుంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







