భారీ డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నాలు విఫలం..1800 మంది అరెస్ట్..!!
- December 29, 2024
రియాద్: బోర్డర్ గార్డ్స్ జనరల్ డైరెక్టరేట్ భారీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నది. వారి వద్ద నుండి 1.3 టన్నుల హషీష్, 1,388,622 నార్కోటిక్ పిల్స్, 136 టన్నుల ఖాట్ గుర్తించి సీజ్ చేశారు. జజాన్, అసిర్, నజ్రాన్ దక్షిణ ప్రాంతాలలో జరిగిన కార్యకలాపాలలో అరెస్టయిన వారిలో 959 మంది ఇథియోపియన్లు, 849 మంది యెమెన్లు, ముగ్గురు సోమాలిస్, ఎరిట్రియన్లు, 12 మంది సౌదీలు ఉన్నారు.
మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911కు, కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాలలో 999కి కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా విక్రయాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా అధికారులు ప్రజలను కోరారు. ప్రజలు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌ని 995లో లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







