ఈవీ సెగ్మెంట్‌లో మార్కెట్లోకి హ్యుందాయ్‌ క్రెటాEV

- January 03, 2025 , by Maagulf
ఈవీ సెగ్మెంట్‌లో మార్కెట్లోకి హ్యుందాయ్‌ క్రెటాEV

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా క్రెటా రీసెంట్ గా విద్యుత్‌ కారును (Hyundai Creta EV) ఆవిష్కరించింది.జనవరి 17న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 వేదికగా ఈ కారును విడుదల చేయనుంది. మార్కెట్లో ఎంతో సక్సెస్ అయిన క్రెటా ఇదే పేరుతో ఈవీ వెర్షన్‌ను హ్యుందాయ్‌ తీసుకొస్తోంది. సాధారణ క్రెటాను పోలిన డిజైన్‌తోనే క్రెటా ఈవీని తీసుకొస్తుండడం గమనార్హం. అందుబాటు ధరలో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు ఈవీ సెగ్మెంట్‌లో మార్కెట్లో టాప్ ప్లేస్ లో ఉన్న టాటా కర్వ్‌, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ వంటి కార్లకు హ్యుందాయ్‌ పోటీ ఇస్తుందా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

దేశంలో పాపులర్‌ కార్లలో హ్యుందాయ్‌ క్రెటా కూడా ఒకటి. అయితే ఈవీ సెగ్మెంట్ లో వస్తున్న ఈ కారు డిజైన్ మరియు ఫీచర్లలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. క్రెటా ఈవీ, ఐసిఇ వెర్షన్‌తో పోలిస్తే కొన్ని మార్పులతో వస్తుంది. ఈ కారు 8 మోనోటోన్ మరియు 2 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు V2L టెక్నాలజీతో వస్తుంది, ఇది వాహనం లోపల మరియు వెలుపల ఉన్న పరికరాలను పవర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

క్రెటా ఈవీ లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది - 42 kWh మరియు 51.4 kWh. 51.4 kWh బ్యాటరీతో ఉన్న వెర్షన్ 0-100 కిమీ వేగాన్ని 7.9 సెకన్లలో చేరుతుంది మరియు 473 కిమీ వరకు రేంజ్ కలిగి ఉంటుంది.

ఈ కారుకు ముందువైపు ఛార్జింగ్‌ పోర్ట్‌ ఇస్తున్నారు. డిజిటల్‌ కీ, లెవల్‌ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌, స్మార్ట్‌, ప్రీమియం, ఎక్స్‌లెన్స్‌ వంటి నాలుగు వేరియంట్లలో ఈ కారు రానుంది. ఇక ఈ కారు ఛార్జింగ్‌ విషయానికొస్తే.. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తోంది. 42 kWh బ్యాటరీతో వస్తున్న కారు సింగిల్‌ ఛార్జ్‌తో 390 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న కారుతో 473 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 

డీసీ ఛార్జర్‌తో కేవలం 58 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయొచ్చు. అదే 11kW ఏసీ హోమ్‌ ఛార్జర్‌తో అయితే 10 శాతం నుంచి 100 శాతం ఛార్జింగ్‌ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఈవీ ఇతర ఈవీ సెగ్మెంట్‌లో టాటా కర్వ్‌, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ వంటి కార్లకు హ్యుందాయ్‌ పోటీ ఇస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com