దోహా మునిసిపాలిటీలో దూసుకుపోనున్న ఎలక్ట్రిక్ కార్స్..!!

- January 04, 2025 , by Maagulf
దోహా మునిసిపాలిటీలో దూసుకుపోనున్న ఎలక్ట్రిక్ కార్స్..!!

దోహా: ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ దోహా మునిసిపాలిటీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్స్ తనిఖీలు, వర్క షాప్స్ ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తరించేందుకు, దోహాను స్థిరమైన స్మార్ట్ నగరాల కోసం గ్లోబల్ మోడల్‌గా మార్చడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ 2024-2030.. ఖతార్ నేషనల్ విజన్ 2030లో ఇది భాగం అని మంత్రిత్వశాఖ పేర్కొన్నది. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. గ్యాసోలిన్, డీజిల్ కార్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి హానికరమైన కాలుష్య కారకాలను విడుదల చేయవు.  ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి హాని చేసే ఎటువంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయవు. గ్యాస్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com