ఇస్లామీయ ఆర్ధిక రాజధానిగా రూపొందనున్న దుబాయ్
- July 09, 2015
ఈ బుధవారం జరిగిన దుబాయ్ మ్యానేజ్ మెంట్ సెంటర్ ఫర్ ద ఇస్లామిక్ ఎకానమీ బోర్డ్ సమావేశానికి యు. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు దుబాయ్ అధినేత హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఇస్లామిక్ బాండ్ మార్కెట్లో (సుకుక్) నెంబర్ 1 గా ఎదగాలనే సుస్థిర లక్ష్యంతో 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వ్యూహం యొక్క మొదటి దశ లక్ష్యాలను నిర్దేశిత తేదీకంటే ముందుగానే సాధించామని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌ని ఇస్లాం వాణిజ్య రాజధానిని చేయాలనే ఆలోచనను వ్యక్తం చేసినపుడు కొందరు సోదరులు సందేహ పడ్డారని, ఇప్పుడు మనం ప్రపంచంలో అతిపెద్ద బంద్ ప్లాట్ ఫార్మ్ గా ఉన్నామని, ఇదే స్థిరచిత్తoతో 2020నాటి లక్ష్యసాధనకు ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా హాజరయ్యారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







