కువైట్‌లో స్థిరంగా HMPV ఇన్ ఫెక్షన్ రేట్లు..!!

- January 08, 2025 , by Maagulf
కువైట్‌లో స్థిరంగా HMPV ఇన్ ఫెక్షన్ రేట్లు..!!

కువైట్: దేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఇన్‌ఫెక్షన్ రేట్లు స్థిరంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో అంటువ్యాధుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదు కాలేదని, ఈ సీజన్‌లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) ప్రస్తుతం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు ప్రధాన కారణమని పబ్లిక్ హెల్త్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ముంథర్ అల్-హస్సావి పేర్కొన్నారు.  అయితే ఇన్‌ఫ్లుఎంజా కేసులు, ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో పెరుగుతున్నాయని తెలిపారు. మంత్రిత్వ శాఖ HMPV తోపాటు ఇన్‌ఫ్లుఎంజాతో సహా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లపై స్పెషల్ ఫోకస్ చేసిందన్నారు. టీకాలు తీసుకోవడం, పరిశుభ్రతను నిర్వహించడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటి నివారణ చర్యలతో వైరస్ ల నుండి మెరుగైన రక్షణ పొందవచ్చని వివరించారు.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచంలోని సంఘటనలను నిశితంగా పరిశీలిస్తోందని, సంబంధిత వైద్య సంస్థలతో నిరంతరం కమ్యూనికేట్ అవుతుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com