BREAKING...తిరుపతిలో తొక్కిసలాట – నలుగురు మృతి
- January 08, 2025
తిరుపతి: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ సందర్భంగా అపశృతి జరిగింది. శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద భక్తులు టోకెన్ల కోసం భక్తులు పోటీ పడడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నలుగురు భక్తులు మరణించారు. ఇందులో తమిళనాడుకు చెందిన భక్తురాలు మల్లిక అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని అధికారులు, పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితుల హాహాకారాలతో రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం గందరగోళంగా మారింది. వైద్యులు వేగంగా స్పందించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వైకుంఠ తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి క్యూ లైన్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బైరాగి పట్టెడ పార్కు వద్ద భక్తులను క్యూలోకి అనుమతించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







