అన్ని ఆహార పదార్థాలకు న్యూట్రిషనల్ లేబులింగ్ 'తప్పనిసరి'..!!
- January 09, 2025
మనామా: దేశీయంగా ఉత్పత్తి అయిన, దిగుమతి చేసుకున్న అన్ని ఆహార ఉత్పత్తులకు పోషకాహార లేబులింగ్ తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. షురా కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బస్సామ్ ఇస్మాయిల్ అల్ బిన్మొహమ్మద్ ఈ మేరకు తెలిపారు. మంత్రిత్వ శాఖ తన పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ద్వారా ఈ నిబంధనలను అమలు చేయడంలో కృషి చేస్తుందన్నారు. క్యాలరీలు సహా ఇతర కీలక వివరాలతో సహా అన్ని ఆహార ఉత్పత్తులు పోషకాహార సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించేలా చూసేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆమోదించబడిన GCC సాంకేతిక లక్షణాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. వివరాలు అరబిక్, ఇంగ్లీషు రెండింటిలోనూ తప్పనిసరిగా పోషకాహార డేటా ఉండాలని సూచించారు. ఆహార నియంత్రణ విభాగం ఇన్స్పెక్టర్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోషకాహార లేబుల్స్ లేని ఉత్పత్తులను విక్రయించడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







