HMPV ముందస్తు జాగ్రత్తలు.. జలుబు లక్షణాలే: వెఖయా అలెర్ట్
- January 09, 2025
రియాద్: సాధారణ శ్వాసకోశ వైరస్లలో ఒకటైన హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సంక్రమణను నివారించడానికి సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెఖయా) అనేక మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. దగ్గు, తుమ్మడం లేదా వైరస్‌తో కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వైరస్ సంక్రమిస్తుందని, అయితే దీని లక్షణాలు దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి జలుబు కేసుల మాదిరిగానే ఉన్నాయని అధికార యంత్రాంగం వివరించింది.
HMPVతో సంక్రమణను నిరోధించడానికి Weqaya అనేక మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. చాలా కేసులు తేలికపాటివని, అయితే ఇది వృద్ధులు, చిన్నపిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని సూచించింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం ద్వారా వైరస్‌ను నివారించవచ్చు అని పేర్కొంది.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ అనేది శ్వాసకోశ వ్యాధి. ఇది ఫ్లూ లేదా జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయితే ఇది బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరియు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో ప్రమాదానికి కారణం అవుతుందని వైద్యనిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







