తిరుపతి బాధితులను పరామర్శించనున్న జగన్
- January 09, 2025
తిరుపతి: తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ రానున్నారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ రానున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను మాజీ సీఎం పరామర్శించనున్నారు. జగన్ తిరుపతి రాబోతున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కాగా.. వైకుంఠ ఏకదాశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద గత అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. మొత్తం ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడగా రియా, స్విమ్స్ ఆస్పతులలో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన వారిని మెరుగైన వైద్య సేవలను అందజేస్తామని మంత్రులు తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి బయలుదేరారు. తిరుపతి ఘటనలో గాయడిపన వారిని పరామర్శించేందుకు కాసేపటి క్రితమే సీఎం పయనమయ్యారు. అంతుకుముందు సీఎంవో అధికారులు చంద్రబాబు సమావేశమయ్యారు. తిరుపతిలో తాజా పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనపై ఓ నివేదిక సీఎంకు చేరింది. తాజా పరిణామాలు, ఎవరి వల్ల తప్పిదం జరిగిందనే అంశంపై చర్చ జరిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







